యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా పీఏసీఎస్ ఛైర్మన్ సింగిరెడ్డి నర్సింహరెడ్డి ఉదయం ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని.. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రం వద్ద పనిచేసే వారు సక్రమంగా పని చేయాలని ఛైర్మన్ సూచించారు. రైతులకు టార్పాలిన్ కవర్లు అందించాలని సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.