యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో కొవిడ్ నిర్ధరణలో కీలకమైన ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని... ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మాత్రమే ఈ సేవలు ఉండగా... నేటి నుంచి భువనగిరిలోనూ అందుబాటులోకి వచ్చాయి.
భువనగిరిలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రం ప్రారంభం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
కరోనా నిర్ధరణలో కీలకమైన ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాన్ని... భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం బీబీనగర్ ఎయిమ్స్‌లో మాత్రమే ఈ సేవలు ఉండగా... నేటి నుంచి భువనగిరిలోనూ అందుబాటులోకి వచ్చాయి.
భువనగిరిలో ఆర్టీపీసీఆర్ సేవలు ప్రారంభం
ఎయిమ్స్‌లో నమూనాలు సేకరించి అక్కడే పరీక్షలు కూడా చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ బాధితుల తాకిడి పెరగడంతో... నమూనాల సేకరణకు భువనగిరికి మార్చినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని వైరస్ అనుమానితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర ముఠాపై పీడీ యాక్ట్ నమోదు
TAGGED:
telangana latest news