కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికై అన్ని దేవాలయాలు, మత ప్రచార సంబంధమైన ప్రదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసేశాయి. ఈ నేపథ్యంలో భక్తుల అభీష్టం మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనలను అనుసరించి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆర్జిత సేవలలో భక్తులు పరోక్షంగా ఆన్లైన్ ద్వారా పాల్గొనే వెసులుబాటును కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున భక్తులకు గోత్రనామాలతో పరోక్షంగా దేవాలయం నందు పూజలు నిర్వహించుటకు వీలు కల్పించారు. ఈ దిగువ చూపిన సేవలు నేటి నుంచి పరోక్ష పద్ధతిన పూజలు నిర్వహించబడును.
- శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి నిజాభిషేకం రూ. 500
- శ్రీయాదాద్రీశునికి సహస్రనామార్చన రూ. 500
- శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం రూ. 1,116
- శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన రూ. 500
వెబ్ సైట్ వివరాలు https://ts.meeseva.telangana.gov.in