తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి శోభ: ప్రధానాలయానికి తుదిమెరుగులు

కరోనా విపత్కాలంలోనూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. సన్నిధికి సంబంధించిన ప్రధాన కట్టడాలు పూర్తయ్యాయి. ప్రధానాలయానికి తుది మెరుగులు దిద్దే పనులను వైటీడీఐ అధికారులు ముమ్మరం చేశారు.

Ongoing Yadadri reconstruction works
యాదాద్రి శోభ: ప్రధానాలయానికి తుదిమెరుగులు

By

Published : Jul 25, 2020, 6:15 PM IST

యాదాద్రి ప్రధానాలయానికి తుది మెరుగులు దిద్దే పనులను వైటీడీఐ అధికారులు ముమ్మరం చేశారు. యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న అష్టభుజ మండప ప్రాకారాల పైన తిరువీధులు, గోపురాలు... ఇలా ఆలయం నలువైపులా తుది మెరుగుల పనులు కొనసాగుతున్నాయి.

మరోవైపు అష్టభుజ మండపం ప్రాకారాలపై కట్టుబడి సున్నంతో వర్షపు నీరు కురవకుండా మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ప్రాకార మండపాలపై తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఒకవైపు డంగు సున్నం గట్టిపడే విధంగా చర్యలు చేపడుతున్నారు. లీకేజీల ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక అద్దాల మండపం పైభాగంలో పనులు చేయిస్తున్నారు.

యాదాద్రి కొండపైన నూతనంగా నిర్మించిన క్యూకాంప్లెక్స్​ స్లాబ్​ పైన వాటర్​ ఫ్రూఫింగ్​ పనులకు వైటీడీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఒకవైపు మౌలిక వసతుల కల్పన పనులు... మరోవైపు దిద్దుబాటు చర్యలు వేగంగా సాగుతున్నాయి.

ఇదీ చూడండి:దక్షిణ భారతంలో ఐసిస్​ ఉగ్రవాదుల అలికిడి

ABOUT THE AUTHOR

...view details