తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri: భక్తులు మెచ్చేలా విష్ణు పుష్కరిణి

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri)లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సంప్రదాయ హంగులతో భక్తులు మెచ్చేలా విష్ణు పుష్కరిణిని నిర్మిస్తున్నారు.

Yadadri: భక్తులు మెచ్చేలా విష్ణు పుష్కరిణి
Yadadri: భక్తులు మెచ్చేలా విష్ణు పుష్కరిణి

By

Published : Jun 10, 2021, 12:20 PM IST

యాదాద్రి(Yadadri) పుణ్యక్షేత్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సంప్రదాయ హంగులతో విష్ణు పుష్కరిణిని నిర్మిస్తున్నారు. బంగారు వర్ణంలో దర్శన వరుసలు.. భక్తి భావం కలిగించేలా రథశాల, వీఐపీల లిఫ్ట్ ఏర్పాట్లు తుది దశకు చేరాయి. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఆరున్నరేళ్లుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాదివ్య పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకొంటుంది.

ఇప్పటికే నల్లరాతితో అష్టభుజ మండప ప్రాకారాలు, ఎత్తయిన గోపురాలు, కనువిందు చేసే శిల్పాలతో స్వామి సన్నిధిని రూపొందించారు. ఆలయం బయట ప్రత్యేక లోహంతో బంగారు వర్ణంలో.. మందిర రూపంలో దర్శన వరుసలు ఏర్పాటవుతున్నాయి. ఈ పనులన్నీ
ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆలయోత్సవాల నిర్వహణకు కొండపైన విష్ణు పుష్కరిణిని పునరుద్ధరిస్తున్నారు. దీని ప్రహరీపై ఇత్తడి స్టాండ్లపై శ్రీ చక్రం పొందుపరిచి.. రెండు వైపులా విద్యుద్దీపాలు అమర్చుతున్నారు. కొండపై పడమటి దిశలో రథశాలను నిర్మిస్తున్నారు. వీఐపీల కోసం లిఫ్టును మందిర ఆకారంలో
రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి: Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

ABOUT THE AUTHOR

...view details