యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. హరిహరులను ఆరాధిస్తూ.. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. సువర్ణ పుష్పార్చనల్లో, శివాలయం వద్దగల మండపంలో సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు.
సెలవు కావడంతో..
ఆదివారం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లఘు దర్శనం ఏర్పాటు చేశారు. కల్యాణ కట్ట, ప్రసాదాల విక్రయశాల వద్ద చాలా రద్దీ ఉంది.