యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయం వద్ద విజయారెడ్డి మృతిని ఖండిస్తూ... రెవెన్యూ సిబ్బంది నిరసనకు దిగారు. అదే సమయంలో పట్టాదారు పాసుపుస్తకం కోసం వచ్చిన ఓ మహిళ వారిని నిలదీసింది. తన వద్ద తీసుకున్న లంచం డబ్బులు తిరిగి ఇవ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయం చుట్టూ తిరగటం వల్ల ఇప్పటి వరకూ ఎంతో డబ్బు ఖర్చయిపోందని అయినప్పటికీ... పనులు పూర్తికాలేవని మండిపడింది. ఏం సమాధానం చెప్పాలో తెలియని రెవెన్యూ సిబ్బంది ధర్నా విరమించి లోపలికి వెళ్లిపోయారు.
'లంచాలు తిని.. ధర్నాలు చేస్తున్నారా?'
తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంపై నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని ఓ మహిళ గట్టిగా నిలదీశారు. తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేయాలంటూ పట్టుబట్టడం వల్ల సమాధానం చెప్పలేక ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
'లంచాలు తిని.. ధర్నాలు చేస్తున్నారా?'
TAGGED:
yadadri bribe mro office