ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. మృతుడు పట్టణంలోని బాహార్పేటకి చెందిన తోట మహేష్‌గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం భువనగిరి పెద్ద చెరువులో గొర్రెలను మేపడానికి రోజు లాగానే తోట మహేష్ వెళ్లాడు. చెరువులో గొర్రెలను కడుగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు.
చెరువులో పడి ఓ యువకుడు మృతి - yadadri bhuvanagiri district news
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గొర్రెలను మేపేందుకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెరువులో పడి ఓ యువకుడు మృతి
స్థానికులు గమనించి మృతుడిని బయటికి తీసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శవపరీక్ష నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: చందపూర్‌లో విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి