తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 1:32 PM IST

ETV Bharat / state

సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో కరోనా అనుమానితుడు

కరోనా అనుమానితుడు కర్ణాటక సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో వస్తున్నాడన్న సమాచారంతో భువనగిరి రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వ్యక్తి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి హైదరాబాద్​ వచ్చి.. సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో నాగపూర్​ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో కరోనా అనుమానితుడు
సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో కరోనా అనుమానితుడు

సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో కరోనా అనుమానితుడు

కరోనా అనుమానితుడు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో వస్తున్నాడనే సమాచారంతో యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్​లోకి పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. కరోనా అనుమానితుడు ఏ1 కోచ్​లో 13 బెర్త్​ నెంబర్​పై వస్తున్నట్లు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రవీంద్రకి సమాచారం రావటం వల్ల స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా అనుమానితుడి స్వస్థలం ఏపీలోని ఏలూరుకు చెందినట్లుగా గుర్తించారు.

అనుమానిత వ్యక్తి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అనంతరం సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో నాగపూర్ వెళ్తుండగా, భువనగిరి రైల్వే స్టేషన్​లో పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు వైరస్ సోకకుండా అతను ప్రయాణించిన బోగీలో రైల్వే అధికారులు స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​ని నలభై నిమిషాలు ఆపివేశారు.

ABOUT THE AUTHOR

...view details