తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం - yadadri bhuvanagiri latest crime news

మద్యం మత్తులో... ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడో వ్యక్తి. బాధితురాలి అరుపులతో అక్కడకు చేరుకున్న స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మాసాన్​పల్లిలో చోటుచేసుకుంది.

one man attempted to rape women in yadaddri bhuvanagiri
మద్యం మత్తులో మహిళపై అత్యాచారయత్నం

By

Published : Jun 17, 2020, 10:40 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్​పల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కేమిడి సోమయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా... ఆమె వద్దకు వెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాధిత మహిళ అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు.

అనంతరం గ్రామస్థులు, బాధిత మహిళ ఫిర్యాాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమయ్య మద్యం మత్తులో ఉండే... ఈ అరాచకానికి పాల్పడ్డట్టు గ్రామస్థులు తెలిపారు.

ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details