Yadadri brahmotsavalu 2022: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా వివిధ అవతారాలలో అలంకరించి ఉదయం, సాయంత్రం ఊరేగిస్తున్నారు. బుధవారం స్వామివారు గోవర్ధనగిరిధారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Yadadri brahmotsavalu 2022: గోవర్ధన గిరిధారి రూపంలో నరసింహుని అభయప్రదానం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
Yadadri brahmotsavalu 2022: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్కు చెందిన భక్తుడు స్వామివారి విమాన గోపురం బంగారు తాపడానికి రూ.54 లక్షల చెక్కును విరాళంగా ఆలయ ఈవో గీతకు అందించారు.
గోవర్ధనగిరిధారి అలంకారంలో స్వామి వారు
హైదరాబాద్కు చెందిన వీణా సుధాకర్ రావు దంపతులు స్వామివారి విమాన గోపురం బంగారు తాపడంకు రూ.54 లక్షల చెక్కును విరాళంగా ఆలయ ఈవో గీతకు అందించారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో ఆలయ ప్రాకార మండప విమానాలపై కలశాలు బిగింపు..