దాతృత్వాన్ని చాటుకున్న పూర్వ విద్యార్థులు - LOCK DOWN EFFECTS
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని సిద్ధార్థ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆహారం పంపిణీ చేశారు. లాక్డౌన్ వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 250 మంది పేదలకు భోజనం అందించారు.
దాతృత్వాన్ని చాటుకున్న పూర్వ విద్యార్థులు
లాక్డౌన్ వేళ దాతృత్వాన్ని చాటుకున్నారు యాదగిరిగుట్ట సిద్ధార్థ హైస్కూల్ పూర్వ విద్యార్థులు. ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న దాదాపు 250 మంది పేదలు, వలస కూలీలకు భోజనం అందించారు. విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. యాదగిరిగుట్టపై ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న కోతులకు పండ్లు కూరగాయలు అందించారు.