వారంతా యాదగిరిగుట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు. ప్రస్తుతం వేర్వేరు ప్రదేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి బ్యాచ్‌కు చెందిన చుక్కల రాజు(35) అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి మధిర గొల్లగుడిసెలు గ్రామానికి చెందిన రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చనిపోయిన మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వవిద్యార్థులు - yadagirigutta news
పుష్కరం క్రితం పదో తరగతి కలిసి చదువుకున్నారు. అలా చదువుకున్న వారిలో ఒకరు చనిపోయిన వార్త విని చలించిపోయారు. తమ స్నేహితుని కుటుంబానికి మేమున్నామనే భరోసా కల్పించాలనుకున్నారు. అంతా కలిసి ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని తలిచారు. వెంటనే ఓ పాడి గేదేను కొనుగోలు చేసి ఇచ్చి తమ స్నేహబంధానికి చాటుకున్నారు.
old friends helped to friends family after his death in yadagirigutta
ఈ విషాద వార్త తెలుసుకొని... ఆ బ్యాచ్ విద్యార్థుల కళ్లు చెమర్చాయి. కష్టాల్లో ఉన్న స్నేహితుడి కుటుంబానికి తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. మృతుని కుటుంబానికి పాడిగేదెను కొనుగోలు చేసి అందజేశారు. తమ స్నేహితుని కుటుంబానికి భరోసాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బెలిదే అశోక్, ఫ్లెక్సీ నరేశ్, పేరబోయిన సత్యనారాయణ, రావుల బాలకృష్ణ ,అల్లం శ్రీధర్, సుంచు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.