యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజైన నేడు హోమం నిర్వహించారు. 108 కళశాల్లో ఉన్న శుద్ధమైన నీటితో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేశారు.
ముగిసిన పాతగుట్ట లక్ష్మీనర్సింహుని బ్రహ్మోత్సవాలు - లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి అనుబంధ దేవాలయం పూర్వగిరి పాతగుట్ట లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఈరోజు 108 కళశాలతో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ముగిసిన పాతగుట్ట లక్ష్మీనర్సింహుని బ్రహ్మోత్సవాలు
స్వస్తి వాచనంతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు నేడు శతఘటాభిషేకంతో ముగిశాయి. ఈరోజు పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు. చివరి రోజు కావడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు.