యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగొని మాసయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై చిక్కుకుపోయాడు. ప్రమాదవశాత్తు కిందకు జారిన మాసయ్య.. చెట్టు పైనుంచి కిందికి వేలాడాడు. దీనిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు, ఎక్సైజ్, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు.
సుమారు 6 గంటల పాటు శ్రమించి చివరకు తాడు సహాయంతో మాసయ్యను కిందకు దించారు. అనంతరం పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మాసయ్య ప్రాణాలతో కిందకు దిగడంతో అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.