తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి హంగులు.. స్వామివారికి బంగారు ఊయల..! - Golden cradle yadadri temple

యాదాద్రి భువనగిరి జిల్లా నారసింహుని క్షేత్రంలో బంగారు ఊయల సిద్ధం చేయనున్నట్లు సమాచారం. విమాన గోపురాన్ని స్వర్ణమయంగా మార్చే క్రతువులో భక్తుల నుంచి బంగారం సేకరించే యోచనలో ఉన్నట్లు యాదాద్రి దేవస్థానం ఈవో గీతారెడ్డి తెలిపారు.

yadadri temple
యాదాద్రి హంగులు.. స్వామివారికి బంగారు ఊయల..!

By

Published : Sep 4, 2020, 10:24 AM IST

Updated : Sep 4, 2020, 11:23 AM IST

నారసింహుని సన్నిధికి మరిన్ని హంగులు అద్దుతున్నారు ఆలయ అధికారులు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి బంగారు ఊయల సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

యాదాద్రి హంగులు.. స్వామివారికి బంగారు ఊయల..!

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా యాదాద్రి సన్నిధిలో కృష్ణ శిలతో పునర్నిర్మాణం చేపట్టారు. ఎక్కడా లేని విధంగా అష్ట భుజ మండల ప్రాకారాలు రూపొందించారు. ఆలయ ముఖ మండపంలో నిత్య సేవోత్సవానికి దాతల సాయంతో బంగారు ఊయల ఏర్పాటు చేయాలని యాడ అధికారులు నిర్ణయించారు.

యాదాద్రి హంగులు.. స్వామివారికి బంగారు ఊయల..!

ఆలయ గర్భగుడిపై కృష్ణశిలతో నిర్మితమైన దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయంగా మార్చే క్రతువులో భక్తులను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగారం సేకరణ యోచన చేస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు.

ఇవీచూడండి:ప్రకృతిపై ప్రేమ .. ఇంటి పైకప్పుపై 400 మొక్కల పెంపకం

Last Updated : Sep 4, 2020, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details