తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం తొమ్మిదైనా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాకపోవటంతో అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

By

Published : Jun 26, 2019, 6:00 PM IST

OFFICIALS INSPECTED BHUVANAGIRI DISTRICT GOVERNMENT HOSPITAL

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి ఆయన వెళ్లారు. కానీ..అక్కడ ఇద్దరు డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. నర్సులు, ఇతర సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంపై అశోక్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​ను ఫోన్ చేసి పిలిపించారు. సమయం దాటినా ఓపి సేవలను ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రయోగశాలలో పరీక్షలు చేసే టెక్నీషియన్స్ కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంపై మండిపడ్డారు. రోగులను, వారి బంధువులను వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళలో రక్త పరీక్షలు చేయించుకోవటానికి త్వరలోనే ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తామని అశోక్ తెలిపారు. సమయానికి విధుల్లోకి రానివారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details