తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంలోని లోటుపాట్లపై అధికారుల దృష్టి - యాదాద్రి ఆలయం వార్తలు

యాదాద్రి ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనలపై అధికారులు అప్రమత్తమయ్యారు. లోపాలను సాంకేతిక కమిటీతో అధ్యయనం చేయించి సరిదిద్దుతున్నట్లు సమాచారం. ఆధునిక యంత్రాలతో వాటర్ ఫ్రూఫింగ్ పనులను చేపట్టారు.

YADADRI
YADADRI

By

Published : Jul 27, 2020, 4:06 PM IST

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలోని లోటుపాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. పునర్నిర్మాణ పనులను సీఎంవో భూపాల్ రెడ్డి ఇటీవల పరిశీలించి పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా యాదాద్రి దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ పక్కా ప్రణాళికతో కసరత్తుకు దిగింది.

ఫ్లోరింగ్ పనులు పూర్తవుతున్న దశలో వర్షం నీటితో బండరాళ్లు కుంగిపోవడంపై నిపుణుల సూచనలు తీసుకున్నట్లు సమాచారం. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రసాదాల తయారీ భవనంపై వాటర్ ఫ్రూఫింగ్ పనులు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details