యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న గర్భిణీల వివరాలు తీసుకొని ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న వైద్యసేవలు, పౌష్టికాహారం గురించి సర్పంచ్ శిరీషాపృథ్వీరాజ్ అడిగి తెలుసుకున్నారు. 65 మంది గర్భిణీలకు పండ్లను, కూరగాయలను, పౌష్టికాహారాన్ని ఆమె అందించారు.
రామన్నపేట సర్పంచ్ పెద్దమనసు.. గర్భిణీలకు పండ్లు, పౌష్టికాహారం.. - లాక్డౌన్ ఎఫెక్ట్
లాక్డౌన్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పౌష్టికాహారం అందక ఇబ్బంది పడుతున్న గర్భిణీలకు చూసి సర్పంచ్ శిరీషాపృథ్వీరాజ్ చలించిపోయారు. ఇంటింటికి వెళ్లి పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలను అందజేశారు. ఎటువంటి ఇబ్బందులున్న తనకు సమాచారం అందించాలని.. ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని వారిలో ధైర్యం నింపారు.
గర్భిణీలకు పౌష్టికాహారం అందజేత
లాక్డౌన్ వల్ల గర్భిణీలు సరైన పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని వారికి తన సొంత డబ్బుతో పండ్లు, పౌష్టికహారం అందించారు. ఈ లాక్డౌన్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్న తనకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. వైద్యులు చెప్పిన మందులను వాడుతూ ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సూచనలు సలహాలు తీసుకోవాలని ఆమె కోరారు. అత్యవసరమైతే తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గర్భిణుల్లో మనోధైర్యం కల్పించారు సర్పంచ్ శిరీషాపృథ్వీరాజ్.