తెలుగుజాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు తార్కాణమైన తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకారపు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు.
బడుగు బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదల కోసం, మహిళలకు సమాన హక్కు కల్పించేందుకు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు లాంటి పథకాలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్పవాడని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సూదగాని పాండు, పులుపు శేఖర్, దామరోజు సత్యనారాయణ, వర్రె లింగయ్య, ఎండీ గాలిబ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - ntr birthday
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలను తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకారపు రమేష్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు