తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి నారసింహుని సన్నిధిలో రద్దీ సాధారణం - యాదాద్రి ఆలయం రద్దీ

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు కుటుంబ సమేతంగా ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.

normal Congestion in yadadri temple in yadadri bhuvanagiri
యాదాద్రి నారసింహుని సన్నిధిలో సాధారణ రద్దీ

By

Published : Nov 1, 2020, 1:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం రద్దీ సాధారణంగా కనిపించింది. ఆర్జిత సేవల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించారు. స్వామి వారికి నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

అభిషేకం, అర్చనలు, హోమం, నిత్య కల్యాణ వేడుకలు నిర్వహించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ తర్వాతే ఆలయంలోకి అధికారులు అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

ఆలయ పరిసరాలు ఘాట్ రోడ్డు, ప్రసాదాల కౌంటర్, క్యూ లైన్లు, స్వామి వారి నిత్య కల్యాణం, దర్శన క్యూ లైన్‌లో భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు నిరాకరించారు.

ఇదీ చదవండి:'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ'

ABOUT THE AUTHOR

...view details