యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరిగింది. భువనగిరి పీఏసీఎస్ ఛైర్మన్‌గా నోముల పరమేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. భువనగిరి సహకార సంఘం ఛైర్మన్‌గా శక్తివంచన లేకుండా, నిస్వార్థంతో రైతుల అభివృద్ధికి పనిచేస్తానని నోముల పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు.
భువనగిరి పీఏసీఎస్ అధ్యక్షునిగా నోముల పరమేశ్వర్‌రెడ్డి - భువనగిరి పీఏసీఎస్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఛైర్మన్, వైస్ఛైర్మన్ల ఎన్నిక పూర్తయింది. భువనగిరి సహకార సంఘం అధ్యక్షునిగా నోముల పరమేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
![భువనగిరి పీఏసీఎస్ అధ్యక్షునిగా నోముల పరమేశ్వర్‌రెడ్డి nomula parameshwar reddy is elected as bhuvanagiri pacs chairman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6093841-thumbnail-3x2-a.jpg)
భువనగిరి పీఏసీఎస్ అధ్యక్షునిగా నోముల పరమేశ్వర్‌రెడ్డి
భువనగిరి పీఏసీఎస్ అధ్యక్షునిగా నోముల పరమేశ్వర్‌రెడ్డి
ఛైర్మన్ మద్దతుదారులు భువనగిరి సహకార సంఘం నుంచి బాబు జగ్జీవన్‌రాం చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. నియోజకవర్గంలోని వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలంలోని పీఏసీఎస్‌లకు ఎన్నికైన ఛైర్మన్ల మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు.
- భువనగిరి నియోజకవర్గంలోని సహకార సంఘాల ఛైర్మన్లు, వైస్ఛైర్మన్లు
పీఏసీఎస్ | ఛైర్మన్ | వైస్ ఛైర్మన్ |
భూదాన్ పోచంపల్లి | కందాడి భూపాలరెడ్డి (తెరాస) | సామ మోహాన్ రెడ్డి (కాంగ్రెస్) |
జూలూరు | అందెల లింగంయాదవ్ (తెరాస) | వాకిటి మల్లారెడ్డి(తెరాస) |
వలిగొండ | సురకంటి వెంకట రెడ్డి (తెరాస) | |
అరూర్ | చిట్టెడి వెంకట్రామి రెడ్డి (తెరాస) | జడిగే బుచ్చయ్య (తెరాస ) |
బీబీనగర్ | మెట్టు శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్) | గడ్డం బాలకృష్ణ |
భువనగిరి | పరమేశ్వర రెడ్డి (తెరాస) | |
చందుపట్ల | ఎమ్ ఎల్ ఎన్ రెడ్డి (కాంగ్రెస్) |