యాదాద్రి లక్ష్మీనరసింహునిపై కరోనా ప్రభావం పడింది. ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉండే ఆలయ పరిసరాలు నేడు వెలవెలబోయాయి. కొవిడ్-19ను దృష్టిలో ఉంచుకొని అధికారులు క్యూలైన్లు, ఆలయ పరిసరాలను తరచుగా శుభ్రం చేస్తున్నారు.
యాదాద్రి ఆలయంపై కరోనా ప్రభావం - యాదాద్రిపై కరోనా ప్రభావం
కరోనా వైరస్ ప్రభావం యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయంపై పడింది. ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడే యాదాద్రిలో నేడు సాధారణ రద్దీ కనిపించింది.
యాదాద్రి ఆలయంపై కరోనా ప్రభావం
కుటుంబ సమేతంగా కొంత మంది భక్తులు లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లలో స్వల్ప రద్దీ కనిపించింది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు.
- ఇదీ చూడండి :రామజన్మ భూమిలో తొలిసారి హారతి దర్శనం ఆ రోజే