తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరమేది? - no physical distance at wine shops

భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా మందుబాబులు ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలన్న నియమం రెండ్రోజులకే పరిమితమై ఆందోళన కలిగిస్తోంది.

మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరమేది?
మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరమేది?

By

Published : May 10, 2020, 2:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. రెండ్రోజులు గడిచేసరికి ప్రభుత్వ నిబంధనలు పెడచెవిన పెట్టి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.

లాక్​డౌన్​ నిబంధనలు పాటించని మోత్కూరు వైన్​ షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎక్సైజ్ సీఐకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. భౌతిక దూరం పాటించని మద్యం దుకాణాల లైసెన్సు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారులు పట్టించుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details