తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం - యాదాద్రి జిల్లా వార్తలు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి, ఉదయం బాలాలయంలో సుప్రభాత సేవల నుంచి ప్రతిష్ట మూర్తులను మేల్కొల్పి హారతి నివేదించారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధిస్తూ వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీ విశ్వక్సేన ఆరాధనతో నిత్య కల్యాణోత్సవ పర్వం చేపట్టారు. భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం
No Crowd In Yadadri

By

Published : Oct 18, 2020, 2:37 PM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతున్నది. ఆలయంలో నిత్యారాథనలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. బాలాలయంలో సుప్రభాత సేవలు మొదలు.. ప్రతిష్టమూర్తులను మేల్కొల్పి హారతి నివేదించారుర. వేదమంత్రాల నమడుమ విశ్వక్సేన ఆరాధనలతో నిత్య కల్యాణోత్సవం ప్రారంభించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి కళ్యాణోత్సవ పర్వం చేపట్టారు. దర్శన మూర్తులకు స్వర్ణపుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు.

యాదాద్రిలో ఆదివారం భక్త జనం.. సాధారణంగా కనిపించింది. కొండపైన ఆలయ పరిసరాల్లో , ప్రసాదాల కౌంటర్లు, క్యూలైన్లు, తలనీలాలు సమర్పించే చోటు, క్షేత్ర పరిసరాల్లో భక్తుల సందడి తగ్గింది. స్వామివారి నిత్య కల్యాణం, అభిషేక పూజలలో భక్తులు తక్కువ సంఖ్యలోనే పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా.. వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొవిడ్ నిబంధన దృష్ట్యా, యాదాద్రికివచ్చిన భక్తులకు థర్మల్ స్క్రీనిoగ్, శానిటైజేషన్ అనంతరమే భక్తులను ఆలయం లోనికి అనుమతిస్తున్నారు. ఆలయ అధికారులు.. భక్తులను సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టి ,భక్తులకు లఘు దర్శన సౌకర్యం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్​లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాదాద్రికి తగ్గిన భక్తుల రద్దీ, కేవలం అరగంటలోనే దర్శనం పూర్తవుతున్నది.

ఇదీ చదవండి:కారు తీయాలంటే.. జేసీబీ రావాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details