తెలంగాణ

telangana

'అడ్మిషన్లు ముగిసినవి..' చర్చనీయాంశమైన ప్రభుత్వపాఠశాలలో ప్లైక్సీ

By

Published : Jun 18, 2022, 3:57 PM IST

admissions closed in govt school: సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ముగిశాయని మనం బోర్డులు చూస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి బోర్డులు చూడటం అరుదు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఓ ఉన్నత పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిసినవి అని ఏర్పాటు చేసిన ప్లైక్సీ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

No admission in govt school:
అడ్మిషన్లు ముగిసినవి

admissions closed in govt school: విద్యలో నాణ్యత ఉండాలే గాని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడతారు. ఈ మాటను అక్షరాల నిజం చేస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ప్రభుత్వపాఠశాల. పట్టణంలోని పన్నాల వెంకటరాంరెడ్డి, ఇందుమణెమ్మ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గంజ్ హైస్కూల్)కు మొదటి ఎంతో పేరు. గత ఏడాది నుంచి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైంది. ఈ ఏడాదికి 7,8,9,10 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు ముగిశాయని ఇటీవల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో ఆరో తరగతి విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తామని, ఇతర తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పించలేమని హెడ్​మాస్టర్ ప్రభాకర్ తెలిపారు. తెలుగు మీడియంలో మాత్రం అన్ని తరగతులకు ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. పాఠశాలలో స్థలాభావం వల్ల ఇంగ్లీష్ మీడియం లో ఎక్కువ మందిని తీసుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం వల్ల మాకు అడ్మిషన్స్ విరివిగా వస్తున్నాయి. రెండు మాధ్యమాల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నాం. మాకు అడ్మిషన్స్ ఓవర్​గా వస్తున్నాయి. ప్లేస్ సరిపోవడం లేదు. ఇతర క్లాసుల్లో తెలుగు మీడియంలో సీట్లు ఉన్నాయి. కానీ ఆంగ్ల మాధ్యమంలో సీట్లు నిండిపోయాయి. ప్రైవేట్​ స్కూళ్లకు దీటుగా మాకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు.

- ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, భువనగిరి గంజ్ హైస్కూల్

నేను పదో తరగతి చదువుతున్నా. ప్రైవేట్​ స్కూళ్ల కంటే మా స్కూల్ చాలా ఛేంజ్ అయింది. మేమంతా ఇంగ్లీషులోనే మాట్లాడతాం. మాకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

- స్పందన, పదోతరగతి విద్యార్థి

విద్యార్థులు కూడా తమ పాఠశాలలో టీచర్లు బాగా చెబుతున్నారని, మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుందని కితాబిచ్చారు. ప్రస్తుతం పాఠశాలలో నాలుగు వందలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో అడ్మిషన్ల కోసం పలువురు విద్యార్థులు ప్రముఖుల సిఫారసు లేఖలు తెస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు.

'అడ్మిషన్లు ముగిసినవి..' చర్చనీయాంశమైన ప్రభుత్వపాఠశాలలో ప్లైక్సీ

ఇవీ చదవండి:

సైన్యాన్నీ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం యత్నం: హరీశ్​రావు

మహిళా సాధికారతతోనే భారత్ అభివృద్ధి: మోదీ

ABOUT THE AUTHOR

...view details