తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో నిత్య ఆరాధన పూజలు - Telangana news

యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిత్యాారాధనలు ఆలయ ఆచార ప్రకారం కొనసాగాయి. కొవిడ్ నేపథ్యంలో భక్తుల రాక గణనీయంగా తగ్గింది. ఆలయ పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. ఇవాళ స్వామివారికి వివిధ కైంకర్యాల ద్వారా నిత్య ఆదాయం రూ.1,34,685 సమకూరింది.

yadadri
yadadri

By

Published : Apr 28, 2021, 7:32 PM IST


పంచనారసింహులు, స్వయంభుగా కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిత్యాారాధనలు ఆలయ ఆచార ప్రకారం కొనసాగాయి. యధావిధిగా ఉదయం నుంచి మొదలైన కైంకర్యాలు, సాయంకాలం వెండి జోడు సేవ వరకు, ఉదయం సుప్రభాతం, హారతి నివేదన, బిందె తీర్థం, అభిషేకం, అర్చన, అష్టోత్తరంతో పాటు హోమం నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంకాలం అలంకార సేవోత్సవం, సహస్రనామార్చన దర్బార్ సేవలు జరిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పూజలు దైవ దర్శనాలను కొనసాగించారు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య ఆరాధనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తజనుల రాక గణనీయంగా తగ్గగా ఆలయ పరిసరాలు దర్శన వరుసలు, కనుమ దారులు బోసిపోయాయి. స్వామివారికి వివిధ కైంకర్యాల ద్వారా నిత్య ఆదాయం రూ. 1,34,685 సమకూరింది.

ABOUT THE AUTHOR

...view details