యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జమ్ముకశ్మీర్ అధికారుల బృందం సందర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, కంటి వెలుగు పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు, వ్యాధినిరోధక, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. జమ్ముకశ్మీర్ నేషనల్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ భూపినర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాంబశివరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చౌటుప్పల్ ఆరోగ్య కేంద్రంలో కశ్మీర్ బృందం... - nhm team in choutuppal
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య, ఆరోగ్య పథకాల అధ్యయనానికి జమ్ముకశ్మీర్ అధికారుల బృందం చౌటుప్పల్లో పర్యటించింది. ఆసుపత్రిలో అందిస్తున్న సదుపాయాలు పరిశీలించారు.
చౌటుప్పల్లో కశ్మీర్ బృందం...