యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా యాదాద్రి కొండ చుట్టూ వలయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే దారిలో వలయ రహదారి పక్కన నాలా నిర్మించారు. కానీ పైకప్పు వేయకుండా వదిలేశారు. అక్కడ వాహనాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. రాత్రివేళలో వాహనదారులు నాలాను గమనించకుండా ప్రయాణిస్తే అందులో పడిపోయే ప్రమాదముంది.
యాదాద్రి వలయ రహదారి వెంట కప్పు లేకుండానే నాలా..! - యాదాద్రి ఆలయం
యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వారం నుంచి యాదాద్రి కొండపైకి వెళ్లే దారిలో నాలాను నిర్మించారు. పైకప్పు వేయకుండా వదిలేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వెంటనే పైకప్పు నిర్మించాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.
పైకప్పు వేయకుండా వదిలేశారు... ఆదమరిస్తే అంతే!
భారీ ప్రమాదాలు జరగక ముందే చర్యలు చేపట్టాలని.. సంబంధిత అధికారులు స్పందించి నాలా పైకప్పు నిర్మించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందేలా కృషి'