తెలంగాణ

telangana

ETV Bharat / state

నయీమ్​ అనుచరుడు మహమ్మద్​ అబేద్​ అలీ అరెస్టు - nayeem follower sheshanna

నయీమ్​ అనుచరుడు మహమ్మద్​ అబేద్​ అలీని భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. భూఆక్రమణ కేసులో నిందితుడైన అలీని కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్​కు తరలించారు. రిజిస్ట్రేషన్​ దస్తావేజుల్లో అలీ సాక్షి సంతకం పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

NAYEEM FOLLOWER MOHAMMED ABED ALI ARRESTED IN BHUVANAGIRI

By

Published : Oct 23, 2019, 9:21 PM IST

భూఆక్రమణ కేసులో నిందితుడైన నయీమ్ అనుచరుడు మహమ్మద్ అబేద్ అలీని భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్​కు తరలించారు. భువనగిరి పట్టణ శివారు ప్రాంతం, నల్లగొండ రోడ్డులో కురుపతి శ్రీదేవి, శ్రీనివాస్​కి చెందిన 9 ఎకరాల 6 గుంటల భూమిని ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో ఇప్పటికే నయీమ్ తల్లి తాహేరా బేగం, సోదరి సలీమా బేగం, అయేషాబేగం, ఎంఏ సలీం అరెస్టయ్యారు. ఈ కేసులో రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో సాక్షిగా సంతకం చేసిన పహాడీనగర్​కి చెందిన మహమ్మద్ అబేద్​ని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ వెల్లడించారు.

నయీమ్​ అనుచరుడు మహమ్మద్​ అబేద్​ అలీ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details