NGT: ఫార్మా కంపెనీల కాలుష్యంపై ఎన్జీటీ సీరియస్.. - national green tribunal fire on pharma industries pollution
20:15 February 03
NGT: ఫార్మా కంపెనీల కాలుష్యంపై ఎన్జీటీ సీరియస్..
ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కె.రామకృష్ణ, ఎక్స్పర్ట్ మెంబర్ సత్యగోపాల్తో కూడిన ఎన్జీటీ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రెబ్యునల్ విచారణ చేపట్టింది.
కాలుష్యంపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని నరేందర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి ఎన్టీటీ వాయిదా వేసింది.
ఇదీ చదవండి: