National Award for Handloom: భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులకు జాతీయ అవార్డులు.! - భూదాన్‌పోచంపల్లి చేనేత
08:53 September 26
చేనేత కార్మికులకు అరుదైన గౌరవం
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampally) చేనేత కళాకారులకు(National Award for Handloom workers) అరుదైన గౌరవం దక్కింది. చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అవార్డులకు భూదాన్‌పోచంపల్లి వాసులు ఎంపికయ్యారు. తడ్క రమేష్, సాయికి కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది.
చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర సర్కారు సంత్ కబీర్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అవార్డు, కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డులను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, డిజైన్ అభివృద్ధి విభాగాల్లో తాము అవార్డులకు ఎంపికైనట్లు సమాచారం అందిందని తడ్క రమేష్, భరత్‌లు తెలిపారు.
ఇదీ చదవండి:Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం