తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి చేరిన రాజ గోపుర ద్వారకవాటాలు - temple

యాదాద్రి ప్రధానాలయం ప్రారంభ సమయం సమీపిస్తున్నకొద్దీ  పనుల్లో వేగం పుంజుకుంది. ప్రధానాలయ రాజ గోపురానికి బిగించే "ద్వారకవాటాలు" (తలుపులు) యాదాద్రికి చేరుకున్నాయి.

రాజ గోపుర ద్వారకవాటాలు

By

Published : Sep 6, 2019, 1:14 PM IST

యాదాద్రీశుడి ప్రధాన ఆలయ రాజ గోపురం "ద్వారకవాటాలు" యాదాద్రికి చేరుకున్నాయి. డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య తలుపులని తరలించారు. చదలవాడ తిరుపతిరావు కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని బోయిన్​పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో ఇంటర్నేషనల్స్​లో తయారుచేయించిన టేకు తలుపులను ట్రక్కుల్లో యాదాద్రికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలేరు శాసన సభ్యులు సునితామహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

యాదాద్రి చేరిన రాజ గోపుర ద్వారకవాటాలు

ABOUT THE AUTHOR

...view details