తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడి చెంతన నరసింహ, ఆంజనేయ అరణ్యాలు - minister indrakaran reddy in yadadri

యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్లే దారిలో ఆహ్లాదం ఉట్టిపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండు పార్కుల్ని ఏర్పాటు చేసింది. లక్ష్మీనరసింహస్వామి పేరుతో ఒకటి... ద్వార పాలకుడైన ఆంజనేయస్వామి పేరున నిర్మించిన మరో వనం... యాత్రికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి.

Narasimha and Anjaneya forest parks Established in yadadri bhongir district
యాదాద్రీశుడి చెంతన నరసింహ, ఆంజనేయ అరణ్యాలు

By

Published : Jul 4, 2020, 9:03 AM IST

నూతన రూపు సంతరించుకుంటున్న యాదాద్రి ఆలయ సమీపాన... ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టేలా ఈ పార్కులను అందుబాటులోకి తెచ్చారు. పచ్చదనం ఉట్టిపడేలా భువనగిరి-యాదాద్రి మార్గంలో ఏర్పాటు చేసిన రెండు అర్బన్ పార్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సహజసిద్ధమైన గుట్టల చెంతన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి... పర్యాటకులకు కనువిందు చేయబోతున్నారు. రాయగిరి-1, రాయగిరి-2లోని మల్లన్న గుట్టల్లో పెంచిన వనాల్ని మంత్రి ప్రారంభించారు.

వివరాలిలా..

రాయగిరి-1 బ్లాక్ లోని రిజర్వ్ ఫారెస్టుకు... ఆంజనేయ అభయారణ్యంగా నామకరణం చేశారు. 56.65 హెక్టార్ల విస్తీర్ణానికి 2 కోట్ల 48 లక్షలు ఖర్చు చేశారు. ఇక రాయగిరి-2 బ్లాక్ లోని ప్రాంతానికి... నరసింహ అభయారణ్యంగా పేరు పెట్టారు. 97.12 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి గాను... 3 కోట్ల 57 లక్షలు వెచ్చించారు. ఇక్కడ వ్యూ పాయింట్లు, నడక మార్గాలు, సెల్ఫీ పాయింట్లు, జంతువుల బొమ్మలు, సహజ వనరులతో సీటింగ్​తో పాటు రాక్ గార్డెన్ ఏర్పాటు చేశారు.

సుదూర ప్రాంతాల నుంచి యాదాద్రి క్షేత్రానికి వచ్చే ప్రయాణికులకు ఈ పార్కులు ఎంతో ఆహ్లాదాన్ని కల్గించనున్నాయి.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details