యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని నల్గొండ ఎస్పీ రంగనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.
యాదాద్రీశుడి సేవలో ఎస్పీ రంగనాథ్ కుటుంబం - nalgonda sp ranganath latest visit
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నల్గొండ ఎస్పీ రంగనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
యాదాద్రీశుడి సన్నిథిలో ఎస్పీ రంగనాథ్ కుటుంబం
అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఎస్పీకి అందజేశారు. దర్శన సమయంలో వారి వెంట ఆలయ అధికారులు, ఆలయ ఏఇవో రమేశ్ బాబు, స్థానిక సీఐ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్కు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకొస్తారు: తలసాని