యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హత్యల కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మరో కేసులో జీవితఖైదు విధించింది. కేసు నంబర్ 109, 110 కేసుల్లో ఉరిశిక్ష విధించిన కోర్టు.. కేసు నంబర్ 111లో జీవితఖైదు విధించింది.
నేరం నిరూపితమైందన్న న్యాయమూర్తి ఎస్.వి.వి.నాథ్ రెడ్డి... మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. డిసెంబర్ 28తో పాటు ఈ నెల 6, 7, 8 తేదీల్లో వాదనలు విన్న న్యాయస్థానం 101 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసింది.