Nalgonda District Collector INTERVIEW: నిన్నటి వరకు రసవత్తరంగా సాగిన మునుగోడు ప్రచారం.. నిన్న సాయంత్రానికి మునిగిసింది. ఇంకా ఎన్నిక సంఘం తమ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి వినయ్ కృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను సిద్ధం చేశామని, పోలింగ్ సిబ్బందికి ఇచ్చే ట్రైనింగ్ పూర్తైందన్నారు. వారికి ఇవ్వవలసిన ఓటింగ్ కిట్లను వారికి ఇస్తున్నామని తెలిపారు.
'ప్రలోభాలకు గురికాకండి.. ఓటు హక్కు వినియోగించుకోండి' - నల్గొండ కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ
Nalgonda District Collector INTERVIEW: రేపు జరగనున్న మునుగోడు ఉపఎన్నిక వేళ ఓటర్లు ఎవరి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నల్గొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి కోరారు. చండూరులో ఎన్నికల సామాగ్రి పంపిణీని పర్యవేక్షించిన ఆయన.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటున్న వినయ్‌కృష్ణారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
1470 మంది పోలింగ్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దాదాపు 3000 మంది పోలీసు సిబ్బంది.. 15 కంపెనీల కేంద్ర బలగాలు ఈ ఎన్నికల భద్రతను చూసుకుంటున్నాయి. దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ విధానాన్ని చాలా వరకు వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ స్లిప్‌లను డిజిటల్ రూపంలో తీసుకువచ్చామన్నారు.. దాదాపు 97శాతం పంపిణీ చేశాము. ఓటు వేయడానికి వచ్చేటప్పుడు పోలింగ్ స్లిప్, ఓటరు ఐడీ గానీ.. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన 12 కార్డులను తీసుకువచ్చిన ఓటు వేయవచ్చునని ఈటీవీ భారత్‌తో ముఖాముఖిలో ఆయన మాటల్లోనే వినండి..
ఇవీ చదవండి: