యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా సమాచారం
యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకుని బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. బాలాలయంలోని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఇతరులు పాల్గొన్నారు.