యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న పుట్ట వద్ద నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి, నైవేద్యం పెట్టి, దీపారాధన చేశారు. ఏటా పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేస్తామని భక్తులు తెలిపారు. అనంతరం కొండపైన బాలాలయంలోని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
యాదాద్రి కొండపై ఘనంగా నాగుల పంచమి - నాగుల పంచమి
నాగుల పంచమిని పురస్కరించుకుని యాదాద్రి కొండపైన వెలసిన పుట్టలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
![యాదాద్రి కొండపై ఘనంగా నాగుల పంచమి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4046885-thumbnail-3x2-vysh.jpg)
నాగుల పంచమి