తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ ఎంపీటీసీపై హత్యాయత్నం... పరారీలో నిందితులు - మాజీ ఎంపీటీసీపై హత్యాయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సింగారం మాజీ ఎంపీటీసీ సకినాల సత్యనారాయణ మొహంపై మద్యం పోసి నిప్పంటించారు ఇద్దరు వ్యక్తులు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Murder attempt on Ex MPTC ... abusers in escape in Yaadadri District
మాజీ ఎంపీటీసీపై హత్యాయత్నం... పరారీలో నిందితులు

By

Published : Jul 2, 2020, 11:08 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సింగారం మాజీ ఎంపీటీసీ సకినాల సత్యనారాయణ మొహంపై మద్యం పోసి నిప్పంటించారు జాలా మాజీ ఎంపీటీసీ భర్త ఠాకూర్​ ప్రమోద్ సింగ్, వడ్ల సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులు. దీంతో అతని ముఖం, కనుబొమ్మలు, నోటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై బాధితుడి బంధువులు, గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని ముందుగా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details