"కాంగ్రెస్ కనుమరుగయ్యే పార్టీ" - కాంగ్రెస్ కనుమరుగయ్యే పార్టీ
కాంగ్రెస్‌పై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిలబడే పార్టీ కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని వెల్లడించారు.
కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మీద నడుస్తున్న పార్టీ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నిలబడే పార్టీ కాదు... కనుమరుగయ్యేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను చీకటిమయం చేశారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెరాస అవినీతి మయమైన, అభివృద్ధి నిరోధక చర్యలపై కమలం పార్టీ పోరాడుతుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలపై మురళీధర్ రావు స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.