తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప లాభం లేదు' - యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరును మున్సిపాలిటీ చేశారు.

గ్రామస్థుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మా ఊళ్లను మున్సిపాలిటీలో విలీనం చేశారని, మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప మా గ్రామాలకు న్యాయం జరగలేదని కొండగడప గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Municipality gains nothing but losses at mothkur yadadri bhuvanagiri
'మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప లాభం లేదు'

By

Published : Jan 8, 2020, 4:28 PM IST

2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరును మున్సిపాలిటీ చేశారు. మోత్కూరు పక్కన ఉన్న కొండగడప, బుజిలాపురం గ్రామాలను విలీనం చేస్తూ కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గ్రామస్థుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మున్సిపాలిటీలో విలీనం చేశారని, మున్సిపాలిటీ వల్ల నష్టాలే కాని లాభాలు లేవని గ్రామస్థులు అంటున్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ.. ప్రస్తుతం పన్నుల పేరుతో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విలీన గ్రామాల ప్రజలకు ఇష్టం లేకున్నా బలవంతంగా రెండు గ్రామాలను మునిసిపాలిటీలో కలిపారని చెబుతున్నారు. పనులు పెరిగాయి కానీ, సౌకర్యాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదంటున్నారు. మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు లేకపోవడం వంటి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

'మున్సిపాలిటీ వల్ల నష్టాలే తప్ప లాభం లేదు'

ఇదీ చూడండి : పనికి చేరారు.. మత్తుమందు పెట్టి మొత్తం ఊడ్చేశారు..

ABOUT THE AUTHOR

...view details