యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వృద్ధుల, వికలాంగుకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేని దివ్యాంగులు, వృద్ధులకోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. దానిలో తీసుకొచ్చి ఓటేయించి తిరిగి ఇంటి వద్ద దింపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పర్యవేక్షించారు.
మోత్కూరులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - municipal voting in motkuru
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 12వార్డులకు గాను 25 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మోత్కూరులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
TAGGED:
municipal voting in motkuru