తెలంగాణ

telangana

ETV Bharat / state

భూములు తిరిగి ఇచ్చేయాలి: మందకృష్ణ మాదిగ - mrps president manda krishna madiga latest news

ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రైతు వేదికలు, ప్రకృతి వనాలు, డంపింగ్​ యార్డుల పేరుతో తెరాస ప్రభుత్వం లాక్కుంటుందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆ భూములు వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్​ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాబు జగ్జీవన్ రావు చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు.

mrps president fire on trs govt in yadadri bhuvanagiri district
భూములు తిరిగి ఇచ్చేయాలి: మందకృష్ణ మాదిగ

By

Published : Aug 30, 2020, 3:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాబు జగ్జీవన్ రావు చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను తెరాస ప్రభుత్వం రైతు వేదికలు, ప్రకృతి వనాలు, డంపింగ్​ యార్డులు పేరుతో లాక్కుంటుందని ఆరోపించారు. ఆ భూములు వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్​ చేశారు.

11 మంది మాదిగ కులానికి చెందిన వారు ఎమ్మెల్యే గా ఎన్నికైనా తెరాస ప్రభుత్వం మాదిగలకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదని విమర్శించారు. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. ప్రభుత్వం ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు.

ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!

ABOUT THE AUTHOR

...view details