తెలంగాణ

telangana

ETV Bharat / state

'అర్హులైన ప్రతిఒక్కరికీ మూడెకరాల భూమి' - mrps founder manda krishna madiga

మహాజన సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల భూ సమస్యలు పరిష్కారం చేస్తామని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అన్ని సామాజిక వర్గాల పేదలందరికి 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/08-September-2020/8728305_224_8728305_1599571592807.png
యాదాద్రి భువనగిరి జిల్లాలో మందకృష్ణ మాదిగ పర్యటన

By

Published : Sep 8, 2020, 7:30 PM IST

ఎస్సీ, ఎస్టీల భూముల పరిరక్షణకై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సందర్శించారు. తెలంగాణ వస్తే ఎస్సీ ఎస్టీలను ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో మందకృష్ణ మాదిగ పర్యటన

ఎస్సీ, ఎస్టీ, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాల పేరిట డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, హరితవనం, రైతు వేదికల పేరిట వారి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం మాట తప్పినా.. ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

2023లో తెరాసకు మిగతా పార్టీలన్ని దాసోహమైనా.. మహాజన సోషలిస్ట్ పార్టీ పోటీగా ఉంటుందని స్పష్టం చేశారు. మహాజన సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల భూ సమస్యలు పరిష్కారం చేస్తామని మందకృష్ణ మాదిగ హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details