యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమల్ల ఎంపీటీసీ రచ్చ కల్పన తన సొంత ఖర్చులతో సుమారు.. రెండు లక్షలతో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చారు. రెండు బోరు బావులను వేయించి.. నీటి సమస్యను పరిష్కరించారు. మంచి నీటి సమస్యను తీర్చినందుకు ఎంపీటీసీ కల్పనకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
సొంత నిధులతో గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చిన ఎంపీటీసీ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
ఎన్నో ఏళ్లుగా పాటిమల్ల గ్రామస్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎంపీటీసీ రచ్చ కల్పన తీర్చారు. సొంత నిధులతో రెండు బోరు బావులను వేయించి.. నీటి సమస్యను పరిష్కరించారు.
సొంత నిధులతో గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చిన ఎంపీటీసీ
గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో శ్మశాన వాటిక భూమి వివాదాస్పదంగా ఉండటం వల్ల ఎంపీటీసీ తన స్వంత ఖర్చులతో 6 లక్షల 70వేల రూపాయలు విలువగల 750 గజాల భూమిని కొనుగోలు చేసి గ్రామ పంచాయతికి అప్పగించారు.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!