తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా బాధితులకు అండగా ఉండాలి' - తెలంగాణ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులను ఎంపీటీసీ నవీన్ అందజేశారు. వైద్య సిబ్బందికి ఉష్ణోగ్రత పరీక్షించే థర్మల్ స్కానర్ అందజేశారు. మందులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు ఉచితంగా ఇచ్చారు. కరోనా బాధితులకు అండగా ఉండాలని సూచించారు.

mptc naveen distribute groceries, vasalamarri mptc distribution essential things
మందులు పంపిణీ చేసిన ఎంపీటీసీ, నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేసిన ఎంపీటీసీ

By

Published : May 8, 2021, 8:03 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో 8 మంది కరోనా బాధితుల కుటుంబాలకు ఎంపీటీసీ పలుగుల నవీన్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇంటింటి సర్వేలో ఉష్ణోగ్రత పరీక్షించడం కోసం థర్మల్ స్కానర్​ను ఆరోగ్య సిబ్బందికి అందజేశారు. కొవిడ్ బాధితులను వ్యాధిగ్రస్తులుగా కాకుండా ఆత్మీయులుగా చూడాలని సూచించారు.

భౌతికదూరం పాటిస్తూ వారికి సాయం చేయాలన్నారు. మందులు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేంద్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:రూ. 860 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత!

ABOUT THE AUTHOR

...view details