యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామపంచాయతీ ముందు గ్రామ ఎంపీటీసీ బోయ ఇందిర ధర్నాకు దిగారు. గ్రామసభలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి తనను అవమానించారని పేర్కొన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తాను దళిత జాతికి చెందిన ఎంపీటీసీ కావడంతో కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ ఆమె ఆరోపించారు. గ్రామస్థులతో కలిసి పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
పంచాయతీ కార్యాలయం ముందు ఎంపీటీసీ ధర్నా - Panchayat Office
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి గ్రామపంచాయతీ ముందు ఎంపీటీసీ బోయ ఇందిర ధర్నాకు దిగారు. తనను అవమానించిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యాలయం ముందు ఎంపీటీసీ ధర్నా