ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంపై తప్పుడు సమాచారం అందిస్తున్నారని లోక్‌సభలో లేవనెత్తారు. 2024లో ఆస్పత్రి సిద్ధం అవుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతుంటే... 2022లో ప్రారంభిస్తామని కేంద్రం చెబుతోందని.. అసలు వాస్తవం చెప్పాలని కోరారు.
బీబీనగర్ ఎయిమ్స్ కోసం వెచ్చించింది రూ.22.78కోట్లు మాత్రమే
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంపై తప్పుడు సమాచారం అందిస్తున్నారని పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండున్నర సంవత్సరాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేవలం 28 కోట్ల మాత్రమే వెచ్చించారని అన్నారు.
రెండున్నర సంవత్సరాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేవలం 28 కోట్ల మాత్రమే వెచ్చించారని అన్నారు. అప్పటికే ఉన్న నిమ్స్‌ను ఆధునికీకరించి ఎయిమ్స్‌గా మారుస్తున్నప్పటికీ.... ఇప్పటికీ ఇన్ పేషెంట్ సౌకర్యం కల్పించలేకపోయారని విమర్శించారు. ఉత్తమ్ ప్రశ్నపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్... ప్రణాళిక ప్రకారమే పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఎయిమ్స్ ప్రాజెక్టు అంచనా వ్యయం ఒక వెయ్యి 28 కోట్లు అని... ఇప్పటివరకు 22.78 కోట్లు వెచ్చించామని తెలిపారు.
ఇదీ చదవండి:నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు...