తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయం కింద రాష్ట్రానికి రూ. 2000 కోట్లు ఇవ్వాలని ప్రధాని కోరారు. కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నిండా మునిగిందని.. జనజీవనం అస్తవ్యస్తమైందని ఆందోళన వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి' - తెలంగాణ వర్షాల బీభత్సం వార్తలు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని.. రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.
'రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి'
ప్రధాని మోదీ ఈ విషయంపై స్పందించి.. రాష్ట్రంలో వర్షం బీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయని.. చాలా చోట్ల రహదారులు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్షాల వచ్చే నష్టలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.
ఇదీ చదవండిః'కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలి'